Lord Venkateswara facts: సంభవామి యుగే యుగే know benefits of worshipping lord venkateswara
కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధముగా ఈ పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎ ఎలాంటి కష్టం అయినా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది. మరి అవేంటో తెలుసుకుందామా..?
మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం. మీరు ముడుపు కట్టే ముం దు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అది ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాన్ని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది. ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి మళ్లీ ఆరబెట్టి, అది పూర్తిగా ఆరిన తరువాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయి పోతుంది. ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత 11 రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిళ్ళలు లేదా 54 రూపాయి బిళ్ళలు లేకుంటే 108 రూపాయి బిళ్ళలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో మీ ఉంచి మూట కట్టాలి. ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి. అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామి వారికి చెప్పుకుంటూ ఆ మూళ్లను వేయాలి. ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని ఓం గం గణపతయే నమః అంటూ 21 సార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి. మనకు ఎంతటి కష్టమైనా దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వరస్వా మిని అష్టోత్తరం ని చదవాలి. 108 గోవింద నామాలు చదవాలి. ఆ తర్వాత పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపులు వేసేటప్పుడు ఆ ముడుపు లో ఉన్నటువంటి దనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వేయాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వరస్వామిని ముడుపు కట్టుకున్నట్టు అయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైనా సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభముగా బయటపడవచ్చు. దీంతోపాటుగా శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.
Lord Venkateswara facts and know benefits of worshipping lord venkateswara also read how to worship lord venkateswara

